US Open 2024: యూఎస్ ఓపెన్ పురుషుల విజేతగా జనిక్ సిన్నర్..తొలిసారి US ఓపెన్ టైటిల్‌ కైవసం

by Maddikunta Saikiran |
US Open 2024: యూఎస్ ఓపెన్ పురుషుల విజేతగా జనిక్ సిన్నర్..తొలిసారి US ఓపెన్ టైటిల్‌ కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్:ఇటలీ(Italy) స్టార్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ జనిక్ సిన్నర్ (Jannik Sinner) యూఎస్ ఓపెన్(US Open) 2024 పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.ఆదివారం అర్థరాత్రి దాటాక జరిగిన ఫైన‌ల్‌లో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz)పై 6-3, 6-4, 7-5 తేడాతో విజయం సాధించాడు. దీంతో త‌న కెరీర్‌లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే యూఎస్ ఓపెన్ టైటిల్‌ గెలిచినా తొలి ఇటలీ ప్లేయర్ గాను రికార్డు సృష్టించాడు.అలాగే నోవాక్ జొకోవిచ్(Novak Djokovic), రోజర్ ఫెదరర్(Roger Federer), మాట్స్ విలాండర్(Mats Wilander) తర్వాత ఒకే సీజన్‌లో రెండు హార్డ్ కోర్ట్ స్లామ్‌లను గెలుచుకున్న నాల్గవ వ్యక్తిగా కూడా అతను రికార్డు నెలకొల్పాడు.

ఆదివారం రాత్రి న్యూయార్క్‌(New York)లోని ఆర్థర్ ఆషే స్టేడియం(Arthur Ashe Stadium)లో రెండు గంటల పాటు సాగిన తుదిపోరులో జనిక్ సిన్నర్ ఆట ప్రారంభం నుంచే తన జోరు కొనసాగించాడు. తొలి రెండు సెట్ లను( 6-3, 6-4) తేడాతో అలవోకగా గెలుచుకున్న సిన్నర్ మూడు సెట్‌లో మాత్రం ఫ్రిట్జ్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.దీంతో సిన్నర్ పుంజుకొని మూడో సెట్లో (7-5) తో ఫ్రిట్జ్ ను బోల్తా కొట్టించాడు.అయితే సిన్నర్ ఈ టోర్నమెంట్ ప్రారంభంలో డోపింగ్ ఆరోపణలను ఎదుర్కొన్నాడు.అలాగే సెమీ ఫైనల్‌లో గాయంతో బాధపడ్డాడు.అయినా సిన్నర్ వీటిని అధిగమించి US ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ గెలవడం విశేషం. తన కెరీర్‌లో ఇది రెండవ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ .కాగా సిన్నర్ ఈ సంవత్సరం ఆస్ట్రేలియా ఓపెన్(Australia Open) గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed