- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాటుతో ముషీర్.. బంతితో సామీ పాండే.. న్యూజిలాండ్‌పై యువ భారత్ భారీ విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ముషీర్ ఖాన్ శతక్కొట్టగా.. సామీ పాండే బంతితో చెలరేగిన వేళ భారత అండర్-19 జట్టు సూపర్-6 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. బ్లూమ్‌ఫోంటీన్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 214 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ భారీ విజయంతో భారత్‌కు సెమీస్ బెర్త్ దాదాపు ఖరారైనట్టే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 295 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్(131) భారీ శతకానికితోడు ఆదర్శ్ సింగ్(52) హాఫ్ సెంచరీతో రాణించడంతో కివీస్ ముందు భారత్ భారీ టార్గెట్ పెట్టింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్-19 జట్టు భారత బౌలర్ల ధాటికి తేలిపోయింది. 28.1 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. స్పినర్ సామీ పాండే మాయలో చిక్కుకుని కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. ముషీర్ ఖాన్ 2 వికెట్లు కూడా తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ చేసిన 19 పరుగులే టాప్ స్కోరంటే కివీస్ బ్యాటర్లు ఏ విధంగా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు. జాక్సన్‌తోసహా జామ్ కమ్మింగ్(16), అలెక్స్(12), జేమ్స్ నెల్సన్(10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. మరో ముగ్గురు ఖాతా తెరవలేదు. స్పినర్ సామీ పాండే(4/19) సత్తాచాటగా.. రాజ్ లింబానీ, ముషీర్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సూపర్-6 రౌండ్‌లో భారత్ ఫిబ్రవరి 2న జరిగే తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది.
శతక్కొట్టిన ముషీర్..రాణించిన ఆదర్శ్
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్ సెంచరీ వీరుడు, ఓపెనర్ అర్షిన్(9) స్వల్ప స్కోరు వెనుదిరగడంతో 28 పరుగులకే జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముషీర్ ఖాన్, మరో ఓపెనర్ ఆదర్శ్ సింగ్ ఇన్నింగ్స్ నిర్మించారు. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముషీర్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాడు. అతనికితోడు ఓపెనర్ ఆదర్శ్ సింగ్(52) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆదర్శ్ సింగ్(52)తో కలిసి 77 పరుగులు, కెప్టెన్ ఉదయ్ సహారన్(34)తో కలిసి 87 పరుగులు జోడించాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత ముషీర్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. తెలుగు కుర్రాడు అవనీశ్(17), ప్రియాన్ష్(10) నిరాశపరిచారు. ఈ పరిస్థితుల్లో ముషీర్ ఖాన్ జట్టుకు అండగా నిలిచాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్న తరుణంలో పోరాట పటిమ కనబర్చిన అతను కివీస్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఈ క్రమంలోనే టోర్నీలో మరో శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడిన ముషీర్ ఖాన్(131) 48వ ఓవర్‌లో వికెట్ పారేసుకున్నాడు. నమన్ తివారి(3 నాటౌట్), రాజ్ లింబాని(2 నాటౌట్) అజేయంగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసన్ క్లార్కే 4 వికెట్లతో సత్తాచాటాడు.
స్కోరుబోర్డు
భారత్ అండర్-19 ఇన్నింగ్స్ : 295/8(50 ఓవర్లు)
ఆదర్శ్(సి)ఓలివర్ తెవాటియా(బి)జాక్ కమ్మింగ్ 52, అర్షిన్(సి)ఎవాల్డ్ ష్రూడర్(బి)మాసన్ క్లార్కె 9, ముషీర్(సి)జాక్ కమ్మింగ్(బి)మాసన్ క్లార్కె 131, ఉదయ్(సి)జాక్ కమ్మింగ్(బి)ఓలివర్ తెవాటియా 34, అవనీశ్(సి)అలెక్స్(బి)ర్యాన్ సోర్గస్ 17, ప్రియాన్ష్(సి)టామ్ జోన్స్(బి)మాసన్ క్లార్కే 10, సచిన్ దాస్(సి)స్నేహిత్(బి)ఎవాల్డ్ ష్రూడర్ 15, అభిషేక్(బి)మాసన్ క్లార్కే 4, నమన్ తివారి 3నాటౌట్, రాజ్ లింబాని 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 18.
వికెట్ల పతనం : 28-1, 105-2, 192-3, 219-4, 257-5, 275-6, 289-7, 289-8
బౌలింగ్ : మాసన్ క్లార్కే(8-0-62-4), ర్యాన్ సోర్గస్(6-0-28-1), ఎవాల్డ్ ష్రూడర్(8-0-50-1), జాక్సన్(2-0-20-0), జాక్ కమ్మింగ్(10-0-37-1), స్నేహిత్(10-0-48-0), ఓలివర్ తెవాటియా(6-0-43-1)
న్యూజిలాండ్ అండర్-19 ఇన్నింగ్స్ : 81 ఆలౌట్(28.1 ఓవర్లు)
టామ్ జోన్స్(బి)రాజ్ లింబాని 0, నెల్సన్ ఎల్బీడబ్ల్యూ(బి)సౌమీ పాండే 10, స్నేహిత్ ఎల్బీడబ్ల్యూ(బి)రాజ్ లింబాని 0, స్టాక్‌పోల్(బి)సౌమీ పాండే 5, జాక్సన్(బి)ముషీర్ ఖాన్ 19, ఓలివర్ తెవాటియా(బి)నమన్ తివారి 7, జాక్ కమ్మింగ్ ఎల్బీడబ్ల్యూ(బి)సామీ పాండే 16, అలెక్స్(సి)అవనీశ్(బి)అర్షిన్ 12, ఎవాల్డ్ ష్రూడర్(బి)ముషీర్ ఖాన్ 7, ర్యాన్ సోర్గస్(స్టంఫ్)అవనీశ్(బి)సామీ పాండే 0, మాసన్ క్లార్కే 0నాటౌట్; ఎక్స్‌ట్రాలు 5.
వికెట్ల పతనం : 0-1, 0-2, 13-3, 22-4, 39-5, 55-6, 69-7, 75-8, 76-9, 81-10
బౌలింగ్ : రాజ్ లింబాని(6-2-17-2), సామీ పాండే(10-2-19-4), నమన్ తివారి(5-0-19-1), ముషీర్ ఖాన్(3.1-0-10-2), అర్షిన్(4-0-13-1)