- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువ భారత్ బోణీ.. అండర్-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌లో భారత అండర్-19 జట్టు శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి గ్రూపు మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. శనివారం సౌతాఫ్రికాలోని బ్లూమ్‌ఫొంటైన్ వేదికగా గ్రూపు-ఏ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 84 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆదర్శ్ సింగ్(76), కెప్టెన్ ఉదయ్ సహారన్(64) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 167 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చారు. ముఖ్యంగా స్పిన్నర్ సౌమీ పాండే(4/24)తో బంగ్లా పతనాన్ని శాసించాడు. ఆరంభం నుంచే భారత బౌలర్లు బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ జిషన్ ఆలమ్(14) వికెట్‌తో రాజ్ లింబాని ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. కాసేపటికే మరో ఓపెనర్ అషికర్ రెహ్మాన్(14), రిజ్వాన్(0)లను సౌమీ పాండే పెవిలియన్ పంపి దెబ్బ కొట్టాడు. స్వల్ప వ్యవధిలోనే అహ్రార్ అమీన్(5) వికెట్ కూడా పడటంతో బంగ్లా 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మహ్మద్ షియాబ్ జేమ్స్(54), అరిఫుల్ ఇస్లామ్(41) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో బంగ్లా పోటీలోకి వచ్చేలా కనిపించింది. కానీ, జోడీకి స్పిన్నర్ ముషీర్ ఖాన్ చెక్ పెట్టాడు. అతను వేసిన 42వ ఓవర్‌లో అరిఫుల్ ఇస్లామ్ ఇచ్చిన క్యాచ్‌ను అవనీశ్ అందుకోవడంతో 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అక్కడి నుంచి బంగ్లా వేగంగా వికెట్లు కోల్పోయింది. కాసేపు పోరాటం చేసిన మహ్మద్ షియాబ్ జేమ్స్ కూడా ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగడు. 46వ ఓవర్‌లో మారుఫ్ మ్రిధా(1)ను సౌమీ పాండే అవుట్ చేయడంతో బంగ్లా ఆట ముగిసింది. భారత బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో సత్తాచాటగా.. ముషీర్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. రాజ్ లింబాని, అర్షిన్ కులకర్ణి, ప్రియాన్ష్‌లకు చెరో వికెట్ దక్కింది. భారత ఓపెనర్ ఆదర్శ్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నెల 25న రెండో గ్రూపు మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది.