Trent Boult :న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ సంచలన నిర్ణయం..

by Vinod kumar |   ( Updated:2023-06-08 10:34:56.0  )
Trent Boult :న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ సంచలన నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ సంచలన నిర్ణయం ప్రకటించాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2023 కోసం న్యూజిలాండ్‌ జట్టులో చేరేందుకు అంగీకరించాడు. గతేడాది ఆగస్ట్‌లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వదులుకున్న బౌల్ట్‌.. బోర్డు విజ్ఞప్తి మేరకుతో మళ్లీ కివీస్‌ తరఫున బరిలోకి దిగేందుకు ఓకే చెప్పాడు. న్యూజిలాండ్‌ ప్రజలు బోల్ట్‌ను వన్డే వరల్డ్‌కప్‌-2023 జట్టులోకి తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తేవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, బౌల్ట్‌.. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు.. గతేడాది న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు కాంట్రాక్ట్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఓవరాల్‌గా బౌల్ట్‌ వరల్డ్‌కప్‌లలో 21.79 సగటున 39 వికెట్లు పడగొట్టి, ఆ దేశం తరఫున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. నిన్న ఇంగ్లండ్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ సైతం ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డు విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్‌ ప్రకటించాక కూడా టెస్ట్‌ల్లో ఆడేందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఈసీబీ మొయిన్‌ అలీని యాషెస్‌ సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో మొయిన్‌ దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed