- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీతో అనుబంధాన్ని పంచుకున్న ధోనీ.. ఇప్పటికీ అతనే బెస్ట్ అంటూ కామెంట్స్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దానికిపైగా భారత జట్టుకు వెన్నెముకగా ఉన్న వీరు మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో పరస్పరం గౌరవం, అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా ధోనీ మరోసారి కోహ్లీతో తన అనుబంధాన్ని పంచుకున్నాడు. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ధోనీకి విరాట్‌తో అనుబంధం గురించి చెప్పాలని అడిగారు.
దానికి ధోనీ బదులిస్తూ..‘మేమిద్దరం 2008 నుంచి కలిసి ఆడుతున్నాం. మా మధ్య వయసు వ్యత్యాసం ఉంది. అయితే, కోహ్లీకి నేను అన్నయ్యనా లేదా సహచరుడినా మీరు ఏం పేరు పెట్టారో నాకు తెలియదు. కానీ, చివరగా దేశానికి చాలా కాలంపాటు ఆడిన సహచరులం. వరల్డ్ క్రికెట్ విషయానికొస్తే కోహ్లీ ఇప్పటికే బెస్ట్ ప్లేయర్.’అని చెప్పుకొచ్చాడు. కాగా, ధోనీ కెప్టెన్సీలోనే కోహ్లీ 2008లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. అలాగే, ధోనీ తర్వాత కోహ్లీ జట్టు పగ్గాలు అందుకోగా.. విరాట్ కెప్టెన్సీలో ధోనీ ఆడాడు. దాదాపు దశాబ్దానికిపైగా వీరిద్దరూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.