- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సునీల్ గవాస్కర్ సర్.. నేను నాలాగే ఉంటా’.. ధ్రువ్ జురెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సత్తాచాటిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా నిరూపించుకున్నాడు. దీంతో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. ధ్రువ్ జురెల్‌ను ఎం.ఎస్ ధోనీతో పోల్చాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై ధ్రువ్ జురెల్ స్పందించాడు. ‘నన్ను ధోనీ సర్‌తో పోల్చినందుకు గవాస్కర్ సర్‌కు ధన్యవాదాలు. కానీ, ధోనీ సర్ సాధించినది ఎవరూ పునరావృతం చేయాలేరని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎప్పటికీ ఒకే ఒక్క ధోనీ ఉంటాడు. నేను ధ్రువ్ జురెల్‌లా ఉండాలనుకుంటున్నా. నేను ఏం చేసినా ధ్రువ్ జురెల్‌లా చేయాలనుకుంటున్నా.’అని తెలిపాడు.
క్రికెట్ కిట్ కోసం తన తల్లి గోల్డ్ చైన్‌ను అమ్మేసిందని ధ్రువ్ జురెల్ గుర్తు చేసుకున్నాడు. ‘నాన్న ఆర్మీలో ఉన్నారు. నన్ను స్పెషల్ ఫోర్స్‌లో చేర్పించాలనుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలకు సిద్ధం చేయాలని భావించారు. అందుకే, నేను క్రికెట్ ఆడటాన్ని ప్రారంభించినట్టు ఆయనకు చెప్పలేదు. ఆ తర్వాత అమ్మానాన్నలకు వివరించాను. చివరికి ఆయన అంగీకరించారు. కశ్మీర్ విల్లో తయారు చేసిన స్లోగర్ బ్యాట్‌ను ఇచ్చారు. రూ. 5 వేల నుంచి 6 వేల వరకు ధర ఉండే క్రికెట్ కిట్‌ను కొనాలనుకున్నప్పుడు మా అమ్మ తన గోల్డ్ చైన్‌ను అమ్మి కిట్ కొనిచ్చింది.’ అని ధ్రువ్ జురెల్ చెప్పుకొచ్చాడు.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల్లో 190 పరుగులు చేశాడు. రాంచీ టెస్టులో ధ్రువ్ జురెల్(90) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో అతను అద్భుతమైన పోరాటం చేశాడు.