హైజంపర్ తేజస్విన్ శంకర్‌కు స్వర్ణం

by Dishanational3 |
హైజంపర్ తేజస్విన్ శంకర్‌కు స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ సత్తాచాటాడు. అమెరికాలోని అరిజోనా అథ్లెటిక్స్ మీట్‌లో శంకర్ పురుషుల హై జంప్ విభాగంలో విజేతగా నిలిచాడు. 2.23 మీటర్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. అమెరికా అథ్లెట్ ఎర్నెస్ట్ సియర్స్, మెక్సికోకు చెందిన రాబెర్టో విల్చెస్ కూడా 2.23 మీటర్ల ప్రదర్శననే చేయడం గమనార్హం. అయితే, శంకర్ తొలి ప్రయత్నంలోనే ఆ ప్రదర్శన చేయడంతో అతన్నే విజేతగా ప్రకటించారు. సియర్న్, విల్చెస్ అదే మార్క్‌ను రెండు, మూడు ప్రయత్నాల్లో అందుకున్నారు. మరో భారత హైజంపర్ సర్వేశ్ కుషారే 2.13 మీటర్ల ప్రదర్శనతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఐదు ఈవెంట్లలో పోటీపడిన శంకర్ మూడు ఈవెంట్లలో విజేతగా నిలిచాడు.

Next Story

Most Viewed