టీంఇండియా భాగస్వామ్యాలు నెలకొల్పాలి.. : హర్భజన్ సింగ్

by Sathputhe Rajesh |
టీంఇండియా భాగస్వామ్యాలు నెలకొల్పాలి.. : హర్భజన్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : టీం ఇండియా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో ఆయన సోమవారం మాట్లాడాడు. ‘టీం ఇండియా పార్ట్‌నర్ షిప్‌లు చేయడంలో మెరుగవ్వాలి. అడిలైడ్ టెస్ట్‌లో భాగస్వామ్యాలను భారత్ నెలకొల్పలేదు. దీంతో స్కోరు బోర్డుపై పరుగులు నమోదు కాలేదు. భారత్ 300 నుంచి 350 పరుగులు చేసి ఉంటే బౌలర్లు ప్రత్యర్థి జట్టును త్వరగా ఆలౌట్ చేసే వీలుంటుంది.’ అన్నాడు. అడిలైడ్ టెస్టులో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించడం, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌తో అదరగొట్టడంతో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

Next Story