- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమిండియా ఓ జన్యూన్ బౌలర్ ను వదిలేసింది: పాక్ మాజీ ప్లేయర్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా వ్యూహాత్మక తప్పిదాలు చేసి ఓటమిపాలైందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు. అతిగా టర్న్ అయిన ఇండోర్ వికెట్‌పై భారత్ ఓ జెన్యూన్ బౌలర్‌ను మిస్సయ్యిందన్నాడు. మహమ్మద్ సిరాజ్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌తో బరిలోకి దిగి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
పరాజయంపై స్పందించిన డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఓ జెన్యూన్ బౌలర్‌ను మిస్సయ్యిందని, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. అతడిని తుది జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇండోర్ టెస్ట్‌లో టీమిండియా ఒక్క పేసర్‌తోనే బరిలోకి దిగితే బాగుండేదన్నాడు. ఉమేశ్ యాదవ్ కొత్తగా జట్టులోకి వచ్చిన నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టాల్సిందని, ఇక్కడే టీమిండియా ఘోర తప్పిదం చేసిందని కనేరియా చెప్పుకొచ్చాడు.