చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇదే తొలిసారి

by GSrikanth |
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇదే తొలిసారి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ మైదానం వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌పై మొదటిసారి 434 పరుగుల భారీ తేడాతో గెలిసి సత్తా చాటింది. ఈ క్రమంలో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. టెస్టుల్లో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. గతంలో న్యూజిలాండ్‌పై 372 పరుగుల తేడాతో, దక్షిణాఫ్రికాపై 337 పరుగుల తేడాతో, ఆస్ట్రేలియాపై 320 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఈ సారి ఏకంగా ఇంగ్లాండ్‌పై 434 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఇంగ్లాండ్‌కు టెస్టుల్లో ఇదే రెండో అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం. కాగా, ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 557 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ జట్టు కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. 33 పరుగులు చేసిన మార్క్ ఉడ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండవ ఇన్నింగ్స్‌లోనూ మెరిశాడు. 5 కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో జడేజాకి ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరోవైపు ఓపెనర్ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ చేతులెత్తేసింది.

Advertisement

Next Story

Most Viewed