- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా తల్లి కోరిక నెరవేర్చలేక పోయా.. టీమిండియా క్రికెటర్ భావోద్వేగం
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భారత జట్టులో, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా.. ఉనద్కత్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన తల్లిదండ్రులతో ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. ‘అవార్డు ఫంక్షన్‌లో అమ్మ, నాన్న పాల్గొనడం నాకు చాలా ఆనందంగా, గర్వంగా అనిపించింది. జీవితంలో రెండు సాధించాలనుకున్నాను.
ఒకటి తాను ఐఐఎమ్ నుంచి డిగ్రీ పొందాలని అమ్మ చిరకాల కోరిక, మరొకటి భారత జట్టుకు ఆడటం. అందులో రెండోది సాధించాను. కానీ, తల్లికి ఎంతో ఇష్టమైన ఐఐఎమ్ డిగ్రీని పొందలేకపోయాను. కానీ, నాకు ఎంతో ఇష్టమైన పని చేసుకుంటూ ఓ స్థాయికి వచ్చాను. ఇది నా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. ఒక కల నిజమైంది’ అని పేర్కొన్నారు. దీంతో ఉనద్కత్‌ను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉన్నప్పుడు ఆ దిశగా 100 శాతం కష్టపడాలి. అలా కష్టపడి అనుకున్నది సాధించిన మీకు అభినందనలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.