Tilak Varma : టీ20 సెంచరీ ‘స్కై’కు డెడికేట్.. తిలక్ వర్మ అనౌన్స్

by Sathputhe Rajesh |
Tilak Varma : టీ20 సెంచరీ ‘స్కై’కు డెడికేట్.. తిలక్ వర్మ అనౌన్స్
X

దిశ, స్పోర్ట్స్ : తన కెరీర్‌లో చేసిన తొలి సెంచరీని తిలక్ వర్మ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు డెడికేట్ చేశాడు. సూపర్ స్పోర్ట్ పార్క్‌లో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తనను ప్రమోట్ చేసినందుకు గాను సెంచరీని భారత కెప్టెన్‌కు అంకితమిచ్చాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి 191.07 స్ట్రైక్ రేట్‌తో 56 బంతుల్లో 107 పరుగులు చేశాడు. మూడో టీ20లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ‘కెప్టెన్ సూర్య కుమార్ నాకు ఎంతో ఇష్టమైన 3వ నెంబర్‌లో బ్యాటింగ్ చేసేందుకు అవకాశమిచ్చాడు. గత రెండు మ్యాచ్‌ల్లో నాల్గవ నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాను. మ్యాచ్‌కు ముందు సూర్య నా రూమ్‌కు వచ్చి మూడో నెంబర్‌లో నువ్వు బ్యాటింగ్‌కు దిగుతున్నావ్. ఇది మంచి అవకాశం, సద్వినియోగం చేసుకో..’ అని మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తిలక్ వర్మ అన్నాడు.

Advertisement

Next Story