గాయత్రి జోడీ శుభారంభం

by Harish |
గాయత్రి జోడీ శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో టోర్నీలో భారత మహిళల డబుల్స్ జంట గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో గాయత్రి జోడీ 21-15, 21-12 తేడాతో అమెరికాకు చెందిన అన్నీ జు-కెర్రీ జు జోడీపై విజయం సాధించింది. అలాగే, అశ్విన్ భట్-శిఖా గౌతమ్, సిమ్రాన్-రితిక జంటలు తొలి రౌండ్‌లో ఓడి నిష్ర్కమించాయి. మెన్స్ సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌లో యువ షట్లర్లు సమీర్ వర్మ, కరుణాకరన్ ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో సమీర్ 11-21, 21-10, 21-14 తేడాతో కోయెల్హో డి ఒలివెరా(బ్రెజిల్)పై, కరుణాకరన్ 21-18, 21-12 తేడాతో యూరియల్ కంజురా(ఎల్ సాల్విడార్)పై విజయం సాధించారు. ఫైనల్ క్వాలిఫయర్ రౌండ్‌లో గెలిస్తే మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తారు.

Advertisement

Next Story

Most Viewed