Axar Patel : టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్.. అక్షర్ పటేల్ ఏమన్నాడంటే?

by Harish |
Axar Patel : టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్.. అక్షర్ పటేల్ ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక పర్యటనకు భారత జట్టు టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ నియామకమైన విషయం తెలిసిందే. తాజాగా సూర్యపై ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. సూర్యకుమార్ బౌలర్ల కెప్టెన్ అని చెప్పాడు.‘సూర్య భాయ్ సంతోషకరమైన వ్యక్తి. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎప్పుడు సరదాగా ఉంచుతాడు. మిమిక్రీ, ఇతర సరదా అంశాలను ఇష్టపడతాడు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో అతని కెప్టెన్సీలో ఆడాను. అతను బౌలర్ల కెప్టెన్. అతని కెప్టెన్సీలో జట్టులో చాలా మార్పు వస్తుందని అనుకోవట్లేదు. అతని ఆలోచనా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుంటాం. ఒక సిరీస్‌తో ఒకరి కెప్టెన్సీని అంచనా వేయలేం. ఎక్కువ మ్యాచ్‌లు ఆడితేనే అతని కెప్టెన్సీ గురించి తెలుసుకోవచ్చు.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో అతను వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యాడు. జడేజా స్థానాన్ని అక్షర్ పటేల్‌తో భర్తీ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed