- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
న్యూఢిల్లీ : ఇండోర్ పిచ్‌కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు సహకరించడం పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐసీసీ సైతం పిచ్ పేలవమైందిగా పేర్కొంటూ మూడు డీమెరిట్ పాయింట్స్ విధించింది. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ.. గతేడాది గబ్బా పిచ్‌పై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రెండే రోజుల్లో ముగిసిన విషయాన్ని ఐసీసీకి గుర్తు చేశాడు.
అప్పుడు గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్ పాయింట్స్ కేటాయించారని ప్రశ్నించాడు. ఆ మ్యాచ్‌కు రెఫరీ ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఏడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. బౌలర్లకు ఎక్కువగా సహకరించిన ఈ పిచ్‌కు ఐసీసీ ఒక్క డీమెరిట్ పాయింట్‌తో ‘బిలో యావరేజ్’ అని రేటింగ్ ఇచ్చింది. తాజా ఇదే విషయాన్ని ఐసీసీకి గుర్తు చేసిన గవాస్కర్ ప్రశ్నలు సంధించాడు.