35 ఏళ్ల తర్వాత.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సుమిత్ సంచలనం

by Harish |   ( Updated:2024-01-16 14:23:43.0  )
35 ఏళ్ల తర్వాత.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సుమిత్ సంచలనం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ సంచలనం సృష్టించాడు. 35 ఏళ్లలో ఓ గ్రాండ్‌స్లామ్‌లో సీడ్‌ ప్లేయర్‌ను ఓడించిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచాడు. క్వాలిఫయర్స్ ద్వారా సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన సుమిత్ టోర్నీలో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో తనకంటే మెరుగైన ర్యాంక్ కలిగిన ఆటగాడిని చిత్తు చేశాడు. 31వ సీడ్, కజకిస్తాన్‌ ప్లేయర్ అలెగ్జాండర్ బుబ్లిక్‌‌పై 4-6, 2-6, 6-7(5-7) తేడాతో సుమిత్ విజయం సాధించాడు. 2 గంటల 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ నం.27 అలెగ్జాండర్ బుబ్లిక్‌‌పై 139వ ర్యాంకర్ సుమిత్ వరుస సెట్లను గెలుచుకోవడం విశేషం. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన సుమిత్ తొలి రెండు సెట్లను సునాయాసంగా గెలుచుకున్నాడు. ఇక, మూడో సెట్‌లో ప్రత్యర్థి గట్టి పోటీనివ్వగా ఏ మాత్రం పట్టు కోల్పోని సుమిత్ సెట్‌ను టై బ్రేకర్‌లో దక్కించుకున్నాడు. దీంతో 35 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో సీడ్ ప్లేయర్‌ను ఓడించిన భారత ఆటగాడిగా సుమిత్ నిలిచాడు. అంతకుముందు భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రమేశ్ క్రిష్ణన్ 1989లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అప్పటి వరల్డ్ నం.1 మ్యాట్స్ విలాండర్‌ను ఓడించాడు. రెండో రౌండ్‌లో సుమిత్ చైనా ప్లేయర్ షాంగ్ జున్‌చెంగ్‌తో తలపడనున్నాడు. 2021‌లోనూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అర్హత సాధించిన సుమిత్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు.

Read More..

దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు

Advertisement

Next Story

Most Viewed