- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా అతడే నడిపించాలి : సౌరవ్ గంగూలీ
కోల్‌కతా : వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాను రోహిత్ శర్మనే నడిపించాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆకాంక్షించాడు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదా.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంపై వారికి మద్దతు పలికాడు. రోహిత్, విరాట్ చాలా క్రికెట్ ఆడారని, విశ్రాంతి తీసుకోవడం సరైందేనని చెప్పాడు. ‘వారు టెస్టు మ్యాచ్‌లకు తిరగొస్తారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆ తర్వాత ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్. ఇలా నాన్ స్టాప్ క్రికెట్ ఉంది. వాళ్లు ఉత్సాహంతో తిరిగొచ్చి సత్తాచాటాలని ఆశిస్తున్నా.’ అని తెలిపాడు. వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఎలా ఆడారో చూశామని, భారత జట్టులో వారిద్దరు కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పాడు.
అలాగే, రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ వరకు కెప్టెన్‌గా కొనసాగాలన్నాడు. ‘రోహిత్ అన్ని ఫార్మాట్లలోకి తిరిగొస్తే భారత జట్టుకు అతనే కెప్టెన్‌గా ఉండాలి. ఎందుకంటే, వన్డే వరల్డ్ కప్‌లో అతని కెప్టెన్సీ చాలా బాగుంది. అతనొక నాయకుడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ వరకు అతను కెప్టెన్‌గా కొనసాగుతాడని అనుకుంటున్నా.’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. అలాగే, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలంపై పొడిగింపుపై దాదా సంతోషం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో అతనికి అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అలాగే, ఐసీసీ ఈవెంట్లలో భారత్ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోవడంపై గంగూలీ స్పందిస్తూ.. ఏదో ఒక్క రోజు భారత్ దాన్ని అధిగమిస్తుందన్నాడు.