- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్‌సీఏను శాశ్వత నివాసంగా భావిస్తున్నారు.. బౌలర్లపై రవిశాస్త్రి సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: టీమ్ ఇండియా బౌలర్ల గాయాల నిర్వహణపై జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విరుచుకుపడ్డారు. కొందరు బౌలర్లు నేషనల్ క్రికెట్ అకాడమీని (ఎన్‌సీఏ) తమ శాశ్వత నివాసంగా భావిస్తున్నారని మండిపడ్డారు. ‘గత మూడు నాలుగేళ్లుగా కొద్దిమంది ఎన్‌సీఏను శాశ్వత నివాసంగా భావిస్తున్నారు. వారికి త్వరలోనే రెసిడెంట్ పర్మిట్ కూడా వస్తుందేమో. ఇక ఇష్టమొచ్చినప్పుడు లోపలికి వెళ్లొచ్చు.. ఇష్టమొచ్చినప్పుడు బయటికి రావచ్చు. ఇది మంచి పద్దతి కాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నా ఉద్దేశంలో మీరు వరుసగా నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేరు. మరి ఎన్‌సీఏకు దేనికి వెళ్తున్నారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక మూడు మ్యాచ్‌లు ఆడి మళ్లీ వెళ్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అయితే, రవిశాస్త్రి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పలేదు. దీపక్ చాహర్ ఇటీవలే గాయపడగా, లోయర్ బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్ చికిత్స కోసం జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ న్యూజిలాండ్‌కు వెళ్లారు.
- Tags
- NCA
- Ravi shastri