- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో రౌండ్‌లోకి సింధు, ప్రణయ్: బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్
దిశ, స్పోర్ట్స్: చైనాలోని నింగ్బో వేదికగా జరుగుతున్న ‘బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్’ టోర్నీలో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మలేషియా ప్లేయర్ గో జిన్ వెయితో తలపడిన సింధు.. 18-21, 21-14, 21-12 తేడాతో విజయం సాధించి, రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. గురువారం జరగనున్న ప్రీక్వార్టర్స్‌లో చైనా ప్లేయర్ హాన్ యూతో పోటీపడనుంది. ఇక, పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్.. చైనా ఆటగాడు లూ గువాంగ్ జూపై 17-21, 23-21, 23-21 తేడాతో గెలుపొందాడు. రెండో రౌండ్లో తైవాన్ ప్లేయర్ సీవై లిన్‌తో తలపడనున్నాడు. ఇదే టోర్నీలో మంచి అంచనాలతో బరిలోకి దిగిన ఇతర భారత ప్లేయర్లు కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌తోపాటు పి.రజావత్ నిరాశపర్చారు. తొలి రౌండ్‌లోనే ఓడిపోయి, టోర్నీ నుంచి నిష్క్రమించారు. మెన్స్ డబుల్స్‌లోనూ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిల జోడీ ఓటమిపాలైంది.