India vs Australia :ఆస్ట్రేలియా పై భారత ప్లేయర్ల సెంచరీల మోత

by Mahesh |   ( Updated:2023-09-24 11:30:46.0  )
India vs Australia :ఆస్ట్రేలియా పై భారత ప్లేయర్ల సెంచరీల మోత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వన్డే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత యువ బ్యాటర్లైన శ్రేయస్, గిల్ ఇద్దరూ సెంచరీతో చెలరేగారు. 97 బంతులు ఆడిన గిల్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో మొత్తం 104 పరుగులు చేశాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 105 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కాగా భారత్ ప్రస్తుతం 35 ఓవర్లకు 3 వికెట్లను కోల్పోయి 249 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో కేఎల్ రాహుల్ 18, కిషాన్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా ఈ సెంచరీతో గిల్ తన ఖాతాలో ఆరో సెంచరీని నమోదు చేసుకున్నారు.

Advertisement

Next Story