ఆసుపత్రిలో చేరిన శుభ్‌మాన్ గిల్.. పాకిస్తాన్ పోరుకు దూరమేనా..?

by Mahesh |   ( Updated:2023-10-10 05:12:55.0  )
ఆసుపత్రిలో చేరిన శుభ్‌మాన్ గిల్.. పాకిస్తాన్ పోరుకు దూరమేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ 2023 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సీజన్ అన్ని జట్లు తమ మొదటి మ్యాచ్ ను ఆడేశారు. భారత్ కూడా ఆస్ట్రేలియా జట్టపై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే.. భారత యువ స్టార్ బ్యాటర్, ఓపెనర్ అయిన శుభ్‌మాన్ గిల్ డెంగ్యూతో బాధపడుతూ మొదటి మ్యాచ్ కు దూరం అయ్యాడు. అలాగే ఈ నెల 11న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు కూడా దూరం అయ్యాడనే వార్తలు వచ్చాయి. దీనికి తోడు అతను.. డెంగ్యూ తీవ్రం కావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడని.. అతను కోలుకోవడానికి వారం రోజులైన పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే.. గిల్ ఈ నెల 14న పాకిస్తాన్ జట్టుతో జరిగే కీలక పోరుకు కూడా దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Advertisement

Next Story