గిల్‌పై వచ్చిన ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టిన టీమిండియా ఓపెనర్.. రెండు గంటలపాటు ఒక్కడే

by Harish |
గిల్‌పై వచ్చిన ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టిన టీమిండియా ఓపెనర్.. రెండు గంటలపాటు ఒక్కడే
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌పై అజేయ శతకం(101 నాటౌట్) బాదిన అతను.. పాక్‌పై(46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరగబోయే చివరి గ్రూపు మ్యాచ్‌లోనూ సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నాడు. అయితే, ఆ మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయంటూ వార్తలు వచ్చాయి.

ఈ నెల 26న ప్రాక్టీస్ సెషన్‌కు గిల్ హాజరుకాకపోవడంతో ఆ వార్తలు పుట్టుకొచ్చాయి. గిల్ గాయపడ్డాడని, అనారోగ్యం బాగా లేదంటూ కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గిల్ గురువారం ప్రాక్టీస్ చేశాడు. దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిసి చెమటోడ్చాడు. గురువారం భారత ఆటగాళ్లకు అఫీషియల్‌గా విశ్రాంతనివ్వగా.. గిల్ ఒక్కడే సాధన చేయడం గమనార్హం. దాదాపు రెండు గంటలపాటు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. త్రోడౌన్ స్పెషలిస్టులు, కొంతమంది నెట్ బౌలర్లు, యూఏఈ క్రికెట్ జట్టులోని ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా గిల్ అందుబాటులో ఉంటాడని తెలిపింది. గాయం పుకార్లను కొట్టివేసింది. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు అదనపు రోజు విశ్రాంతి తీసుకున్నాడని తెలిపింది.


Next Story