India vs Australia : ఆస్ట్రేలియాపై చెలరేగుతున్న యువ బ్యాటర్లు.. శ్రేయస్ సెంచరీ

by Mahesh |   ( Updated:2023-09-24 11:33:05.0  )
India vs Australia : ఆస్ట్రేలియాపై చెలరేగుతున్న యువ బ్యాటర్లు.. శ్రేయస్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో భారత యువ బ్యాటర్లు ఆస్ట్రేలియా జట్టుపై చెలరేగి ఆడుతున్నారు. మొదటి మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్.. రెండో వన్డేలో సెంచరీతో రాణించాడు. దీంతో వన్డేల్లో తన మూడో సెంచరీ నమోదు చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో 86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అయ్యర్ 101 పరుగులు చేశాడు. కాగా భారత్ ప్రస్తుతం భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతుంది. 30 ఓవర్లకు భారత్ 1 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసింది.

Advertisement

Next Story