ఒత్తిడి తగ్గించుకునేందుకు బంగ్లాదేశ్ క్రికెటర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Sathputhe Rajesh |
ఒత్తిడి తగ్గించుకునేందుకు బంగ్లాదేశ్ క్రికెటర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

న్యూఢిల్లీ : మరో రెండు వారాల్లో ఆసియా కప్ మొదలుకానుంది. ఆరు దేశాలు పాల్గొనే ఈ టోర్నీకి ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. బంగ్లాదేశ్ జట్టు సైతం సన్నద్ధమవుతోంది. ఢాకాలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో ఆ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరల్డ్ కప్, ఆసియా కప్ వంటి టోర్నీలో ఆటగాళ్లపై ఒత్తిడి ఉండటం సహజమే. ఒత్తిడిని తగ్గించుకునేందుకు బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మద్ నయీమ్ షేక్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మైండ్ ట్రైనింగ్‌లో భాగంగా అతను నిప్పులపై నడిచాడు. ట్రైనర్ పర్యవేక్షణలో అతను ఈ పని చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. వరల్డ్ కప్, ఆసియా కప్‌‌లో రాణించాలంటే ఇలాంటి తిప్పలు తప్పవని కొందరు అంటుంటే.. మరికొందరు ఇదెక్కడి ట్రైనింగ్ రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా, 2012, 2016, 2018 ఎడిషన్లలో ఫైనల్‌లో బోల్తా పడిన బంగ్లాదేశ్.. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలుచుకోవాలని పంతంతో ఉన్నది. ఈ నెల 30 నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. ఈ నెల 31న బంగ్లా జట్టు తన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను ఎదుర్కోనుంది.

Next Story

Most Viewed