పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు షోయబ్ అక్తర్ సూచన (వీడియో)

by GSrikanth |   ( Updated:2022-09-13 11:12:31.0  )
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు షోయబ్ అక్తర్ సూచన (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్-2022 ఫైనల్‌లో పాకిస్తాన్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. శ్రీలంక ఈ టోర్నమెంట్‌లో ఏమాత్రం గట్టిపోటీ ఇవ్వదని భావించిన అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీలంక ఆసియా కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను మట్టి కరిపించి ఘన విజయం సాధించింది. దీంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. తాజాగా.. ఈ ఓటమిపై పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ''బాబర్ తిరిగి జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలి. ఆటపై, జట్టుపై దృష్టి పెంచాలి. ప్రపంచకప్‌కు సిద్ధం కావడానికి ఇంగ్లండ్‌తో 7 టీ20లు ఉన్నాయి. దాన్ని పూర్తిగా వినియోగించుకోండి.' అంటూ సోషల్ మీడియా వేదికగా షోయబ్ అక్తర్ వీడియో బైట్ విడుదల చేశారు.

Also Read: 'నన్ను క్షమించండి.. పాకిస్తాన్ ఓటమికి కారణం నేనే'

Advertisement

Next Story

Most Viewed