Shami : జోస్యం కోసం ఆయన్ను కలవండి.. సంజయ్ మంజ్రేకర్‌పై షమి సెటైర్లు

by Sathputhe Rajesh |
Shami : జోస్యం కోసం ఆయన్ను కలవండి.. సంజయ్ మంజ్రేకర్‌పై షమి సెటైర్లు
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌పై టీంఇండియా పేస్ బౌలర్ షమి సీరియస్ అయ్యాడు. ఇండియా పేస్ బౌలింగ్‌లో మంచి పేరున్న షమికి ఐపీఎల్ మెగా వేలం- 2025లో అతడికి తగ్గ ధర దక్కడం కష్టమే అన్నాడు. గాయం కారణంగా చాలా రోజుల ఆటకు షమి దూరంగా ఉన్నాడని గుర్తు చేశాడు. ఇదే అంశం షమి ధరను ఫిక్స్ చేస్తుందని అభిప్రాయపడ్డాడు. దీనికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్ స్టా వేదికగా షమి కౌంటర్ ఇచ్చాడు. ‘బాబాకీ జయ‌హో. మీ భవిష్యత్తు కోసం ఈ జ్ఞానాన్ని వాడుకోండి పనికొస్తుంది సంజయ్ జీ. ఎవరికైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే సార్‌ను కలవండి.’ అంటూ షమి స్టోరీ పెట్టాడు . ఐపీఎల్ మెగా వేలం-2025లో షమి రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ ఆటగాడిని 2022లో గుజరాత్ టైటన్స్ రూ.6.25 కోట్లకు సొంతం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed