టీ20 క్రికెట్ చరిత్రలో చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్

by Mahesh |   ( Updated:2023-03-30 01:58:16.0  )
టీ20 క్రికెట్ చరిత్రలో చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్ నిలిచాడు. బుధవారం ఐర్లాండ్ తో జరిగిన రెండో T20Iలో ఐదు వికెట్లు పడగొట్టిన షకీబ్.. ఐర్లాండ్ నడ్డి విరిచాడు. దీంతో 36 ఏళ్ల అతను తన T20I వికెట్ల సంఖ్యను 136 కి పెంచుకున్నాడు. దీంతో షకీబ్ T20I క్రికెట్‌లో 134 వికెట్లు తీసిన న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌతీని అధిగమించాడు.

Advertisement

Next Story