షారుఖ్ ఖాన్ 'జవాన్‌' సీన్‌ లీక్‌: సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్

by Shiva |   ( Updated:2023-03-10 17:16:33.0  )
షారుఖ్ ఖాన్ జవాన్‌ సీన్‌ లీక్‌: సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ‘పఠాన్’ సినిమా సూపర్ హిట్ తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా 'జవాన్‌'. సౌత్ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయనడంలో ఏమత్రం అతిశయోక్తి లేదు. ‘పఠాన్‌’ సినిమా భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో ‘జవాన్‌’ పై మరింత ఆసక్తి నెలకొంది.

అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జవాన్‌’ సినిమాకు సంబంధించిన ఓ యాక్షన్ సన్నివేశం సోషల్‌ మీడియాలో లీక్ అయ్యింది. ఆ వీడియోలో షారుఖ్ ఖాన్ లుక్‌ ఫ్యాన్స్ కి కిక్‌ ఇచ్చే విధంగా ఉంది. సిల్వర్ బెల్ట్ తో విలన్స్ ను కొడుతున్న దృశ్యాలు చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో వీడియో సామాజిక మాధ్యమాల్లో కొన్ని నిమిషాల్లోనే వైరల్‌ అయింది. దాంతో షారుఖ్‌ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్ ప్రతినిధులు రంగంలోకి దిగి వెంటనే ఆ వీడియోను తొలగించేలా చర్యలు తీసుకుంది.

కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడా ఆ వీడియో లేదు. అప్పటికే చాలా మంది ఫ్యాన్స్ వీడియోను చూసేశారు. ‘జవాన్’ సినిమా.. ‘పఠాన్’ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఆ చిన్న వీడియోను చూస్తుంటేనే అర్థం అవుతోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా రూ.వేయి కోట్లతో రికార్డులను సృష్టించబోతుందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed