Stuart Broad: 'ఆ భయంతో రిటైర్మెంట్ తీసుకున్నా'.. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్

by Vinod kumar |
Stuart Broad: ఆ భయంతో రిటైర్మెంట్ తీసుకున్నా.. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్
X

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్ 2023 ఆఖరి టెస్టు తర్వాత ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాను రిటైర్ అవ్వడానికి కారణాన్ని బయటపెట్టాడు స్టువర్ట్ బ్రాడ్. 167 టెస్టులు ఆడిన స్టువర్ట్ బ్రాడ్, 604 వికెట్లు తీశాడు. తన ఆఖరి టెస్టులో ఆడిన ఆఖరి బంతికి సిక్సర్ బాదిన స్టువర్ట్ బ్రాడ్, తన అంతర్జాతీ కెరీర్‌లో వేసిన ఆఖరి బంతికి వికెట్ పడగొట్టాడు. ఇంకా కొన్ని నెలలు క్రికెట్ ఆడి, గాయపడితే మళ్లీ దాని గురించి కోలుకోవడానికి సమయం తీసుకుని.. సమయాన్ని వృథా చేయడం అనవసరమని అనిపించింది.

నా కెరీర్‌లో యాషెస్ సిరీస్‌ ఓ మైలురాయి. నాకున్న అతి పెద్ద భయం, 20 ఏళ్ల ఓపెనింగ్ బ్యాటర్లకు బౌలింగ్ చేయాల్సి రావడమే.. నా గురించి వాళ్లు, ‘‘స్టువర్ట్ బ్రాడ్ చాలా గొప్ప బౌలర్ అని విన్నా, కానీ అవన్నీ ఉట్టి మాటలే..’’ అనడం వినకూడదని కోరుకున్నా. ఓ స్టార్ పర్ఫామర్‌గానే రిటైర్ అవ్వాలని అనుకున్నా.. అందుకే యాషెస్ సిరీస్‌లోనే రిటైర్మెంట్ తీసుకున్నా అని పేర్కొన్నారు. నేను బౌలింగ్ చేసేటప్పుడు నా సైగల ద్వారా వికెట్ కీపర్‌కి సిగ్నల్ ఇచ్చేవాడిని. వాతావరణంతో సంబంధం లేకుండా నా షర్ట్‌ని పైకి మడత బెడితే స్లో బాల్స్ వేయబోతున్నానని సిగ్నల్. చాలామందికి నేను ఎందుకు ఇలా చేస్తున్నానో అర్థమయ్యేది కాదు..’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.

Advertisement

Next Story

Most Viewed