కీలక మ్యాచ్‌లో ముంబైని చావుదెబ్బ కొట్టిన సీనియర్ బౌలర్

by GSrikanth |   ( Updated:2023-05-27 03:11:41.0  )
కీలక మ్యాచ్‌లో ముంబైని చావుదెబ్బ కొట్టిన సీనియర్ బౌలర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-16లో భాగంగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. డూ ఆర్ డై మ్యాచులో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించి.. ఈ సీజన్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ముందుగా టాస్ ఒడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. యువ బ్యాటర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ(129)తో మెరవగా, సాయి సుదర్శన్(43), హార్దిక్ పాండ్యా(28) పరుగులతో రాణించారు. అనంతరం 234 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ(61) చేయగా, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ(43; 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో తప్పక రాణిస్తాడని భావించిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపర్చాడు. కాగా, కీలక మ్యాచ్‌ గెలుపులో గుజరాత్ సీనియర్ బౌలర్ మోహిత్ వర్మ కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ యాదవ్, విష్ణు వినోద్, జోర్డాన్, పీయూష్ చావ్లా, కార్తికేయను ఔట్ చేసి గుజరాత్‌కు గెలుపును సులువు చేశాడు.

IPL 2023 Qualifier 2: సెంచరీతో చెలరేగిన గిల్‌.. ముంబై ఇండియన్స్‌ టార్గెట్‌ ఇదే

Advertisement

Next Story