సాకర్ లెజెండ్‌కు కళ్లు చెదిరే ఆఫర్..

by Vinod kumar |
సాకర్ లెజెండ్‌కు కళ్లు చెదిరే ఆఫర్..
X

పారిస్: ఫ్రాన్స్‌కు చెందిన సాకర్ లెజెండ్ కైలియన్ ఎంబాప్పే ప్రపంచ రికార్డు సృష్టించనున్నాడు. అతడిని సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ అనే ప్రో లీగ్ క్లబ్ ఏకంగా 332 మిలియన్ అమెరికా డాలర్లకు (రూ.2,716 కోట్లకు పైగా) బిడ్ చేసింది. ప్రస్తుతం పార్క్‌డెస్ ప్రిన్సెస్ క్లబ్ తరఫున ఆడుతున్న ఎంబాప్పే అక్కడ కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రముఖ ఫార్డర్ ఆటగాడు 2018లో ఫ్రాన్స్ ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 24 ఏళ్ల ఈ యువ ఆటగాడి ప్రస్తుత మార్కెట్ విలువ 94.8-157.9 మిలియన్ యూరోలు (రూ.892-1,431 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా వేశారు.

అయితే.. ఎవరూ ఊహించని విధంగా అతడిని అల్ హిలాల్ క్లబ్ అత్యంత ఉన్నత స్థాయికి చేర్చిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఎంబాప్పేను కొనుక్కునేందుకు రియల్ మాడ్రిడ్, చెల్సియా, న్యూకాజిల్‌తో సహా పలు అగ్రశ్రేణి క్లబ్‌లు చర్చలు జరుపుతున్న తరుణంలోనే సౌదీ క్లబ్ సాహసోపేత బిడ్‌తో ముందుకు రావడం విశేషం. అయితే.. ఎంబాప్పేతో సౌదీ క్లబ్ ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు అల్ హిలాల్ క్లబ్‌కు వెళ్తాడా.. రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు బదిలీపై వెళ్తాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

Next Story