స్విస్ ఓపెన్ నెగ్గిన భారత జోడి.. తొలి భారత జంటగా..

by Vinod kumar |
స్విస్ ఓపెన్ నెగ్గిన భారత జోడి.. తొలి భారత జంటగా..
X

బాసెల్: స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జోడీ 21-19, 24-22 తేడాతో చైనా‌కు చెందిన రెన్ జియాంగ్ యు-టాన్ కియాంగ్‌ జోడీపై అద్భుత విజయం సాధించింది. 54 నిమిషాలు పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత ద్వయం ఏ దశలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకుంది. తొలి గేమ్‌లో ఆరంభం నుంచి లీడ్‌లో కొనసాగిన సాత్విక్ జోడీ అదే దూకుడుతో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో గేమ్‌ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది.

ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీఎదురైనప్పటికీ.. భారత జోడీ పట్టువదల్లేదు. 22-22తో స్కోరు సమమైన సమయంలో వరుసగా రెండు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ దక్కించుకుని విజేతగా నిలిచింది. దాంతో స్విస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారత జంటగా నిలిచింది. అలాగే, ఈ ఏడాదిలో సాత్విక్ జోడీకి ఇదే మొదటి టైటిల్ కాగా.. మొత్తంగా 5వ వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించింది.


Advertisement

Next Story

Most Viewed