- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీకి కెరీర్ బెస్ట్ ర్యాంక్..
న్యూఢిల్లీ: భారత టాప్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి కెరీర్ బెస్ట్ ప్రపంచ 4వ ర్యాంక్‌ను సాధించింది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. సాత్విక్-చిరాగ్ జంట గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో టైటిల్ గెలిచింది. అంతేకాదు ఈ సీజన్‌లో స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో విజేతగా నిలిచి మొత్తం 12 టోర్నీలకు గాను 74,651 పాయింట్లు సాధించింది. పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. గత వారంలో మలేసియా మాస్టర్స్‌లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ గెలిచిన హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం ఎగబాకి 8వ ర్యాంక్‌లో నిలిచాడు.
కాగా.. కిదాంబి శ్రీకాంత్ మూడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్ సాధించాడు. మలేసియా మాస్టర్స్‌లో ఆరంభంలోనే నిష్ర్కమించిన లక్ష్యసేన్ ఒక స్థానం దిగజారి 23వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పీవీ సింధు 13వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాల్లీ, గాయత్రి గోపీచంద్ జంట 15వ ర్యాంక్‌లో నిలిచింది.