అందుకే దూకుడుగా ఆడాను: Sanju Samson

by Vinod kumar |
అందుకే దూకుడుగా ఆడాను: Sanju Samson
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా బ్యాటర్ సంజూ శాంసన్ (41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51)హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేందుకే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడానని తెలిపాడు. ఎదుర్కొన్న తొలి బంతినే అటాక్ చేశాడు. రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్న సంజూ శాంసన్‌ మొదటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. రెండో వన్డేలో 9 పరుగులకే విఫలమయ్యాడు. అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా మూడో వన్డేలో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇదే విషయాన్ని ఇన్నింగ్స్ అనంతరం సంజూ శాంసన్‌ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు.

పుట్టిన దేశం కోసం పరుగులు చేయడం కన్నా సంతోషం మరొకటి ఉండదని చెప్పాడు. బౌలర్లను డామినేట్ చేయడానికే అటాకింగ్ గేమ్ ఆడినట్లు చెప్పుకొచ్చాడు. 'భారత క్రికెటర్‌గా కొనసాగడం సవాల్‌తో కూడుకున్న పని. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాను. 8-9 ఏళ్లుగా భారత జట్టు తరఫున వచ్చిన అవకాశాలను అందుకుంటున్నా. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాకు ఓ స్థానమంటూ లేదు. కాబట్టి ఏ స్థానంలో ఆడాల్సి వచ్చినా సిద్దంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను అని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 200 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed