సిక్స్‌ బాదితే బ్యాట్‌తో కొడతా సచిన్ వార్నింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్

by Vinod kumar |
సిక్స్‌ బాదితే బ్యాట్‌తో కొడతా సచిన్ వార్నింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు తరఫున టెస్టులలో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా సచిన్‌కు, తనకు మధ్య మైదానంలో జరిగిన సరదా సంఘటనను గుర్తు చేసుకున్నాడు. బాదుడే మంత్రంగా బౌండరీల మోత మోగించే వీరూ.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ముల్తాన్ టెస్టులో వీరూ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అయితే ఈ టెస్టులో ట్రిపుల్ సెంచరీ ముందు తాను సిక్సర్ కొడతానని అంటే అవతలి ఎండ్ లో ఉన్న సచిన్ తనను వారించాడని.. ‘నీకేమైనా పిచ్చా..? ఇంతవరకూ ఏ ఒక్క ఇండియన్ బ్యాటర్ కూడా ట్రిపుల్ సెంచరీ చేయలేదు. ఆ అవకాశాన్ని పాడు చేసుకోకు. నువ్వు సిక్సర్ కొడితే నా బ్యాట్ తో కొడతా’అని చెప్పాడని, కానీ తాను మాత్రం సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్ లో 294 వద్ద ఉండగా సిక్సర్ బాది ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశానని వీరూ తెలిపాడు. తాను ట్రిపుల్ సెంచరీ చేసినందుకు తనకంటే ఎక్కువ సచినే సంతోషించాడని వీరూ వివరించాడు.

తనని కొంతమంది రిషభ్ పంత్‌‌తో పోల్చడంపై కూడా సెహ్వాగ్ స్పందించాడు. తాను డబుల్ సెంచరీల మీద దృష్టి పెడితే పంత్ మాత్రం 90 లలోనే ఆగిపోతాడని చెప్పాడు. ‘టీమిండియాలో నా మాదిరిగా బ్యాటింగ్ చేసే బ్యాటర్ ఉన్నాడని నేను అనుకోను. కొంతలో కొంత రిషభ్ పంత్, పృథ్వీ షా ల బ్యాటింగ్ నా బ్యాటింగ్ శైలిని పోలి ఉంటుంది. ఈ ఇద్దరిలో రిషభ్ పంత్ కాస్త దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాడు. కానీ, టెస్టు క్రికెట్ లో పంత్.. 90-100 పరుగుల వద్దే ఆగిపోతాడు. కానీ నేను మాత్రం 200, 250, 300 చేయాలనే మైండ్ సెట్ తో ఉంటా అనిచెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed