- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్థానంలో బ్యాటింగ్ ఇష్టపడను: రోహిత్
దిశ, స్పోర్ట్స్ : బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడొవ స్థానంలో బ్యాటింగ్ చేయడం తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడాడు. ఈ సందర్భంగా గిల్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్ దించడంపై ఎదురైన ప్రశ్నకు రోహిత్ స్పందిస్తూ.. ‘బ్యాటింగ్ స్థానాల గురించి ఎలా ఆలోచిస్తారనేది వ్యక్తిగత విషయం. బ్యాటింగ్ నం.3 నాకు వ్యక్తిగతంగా నచ్చదు. ఓపెనర్‌గా లేదంటే 5వ, 6వ స్థానంలో వస్తాను. కానీ, 3వ స్థానం నుంచి 7వ స్థానం వరకు ఎవరికైనా సరైన స్థానం కాదు.’ అని తెలిపాడు. ‘కొన్ని సందర్భాల్లో ఓపెనర్ తొలి ఇన్నింగ్స్‌లో గాయపడినా లేదా త్వరగా అవుటైనా నం.3 బ్యాటర్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది. కాబట్టి, పెద్ద తేడా ఏం ఉండదు.’ అని చెప్పుకొచ్చాడు. అలాగే, కొన్నిసార్లు తమ బౌలింగ్ దళానికి అనుభవం లేదని అనిపిస్తుందని, ఏ జట్టుకైనా ఇది జరుగుతుందని చెప్పాడు. ఈ సమయంలో జట్టుపై నమ్మకం ఉంచాలని, వారికి మద్దతు ఇవ్వాలన్నాడు.