- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ శర్మ అరుదైన ఘనత.. తొలి భారత కెప్టెన్‌గా..
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించిన హిట్‌మ్యాన్.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. రోహిత్ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో అదరగొట్టాడు. దీంతో కెరీర్‌లో రోహిత్‌కు ఇది 9వ టెస్ట్ సెంచరీ.
తొలి భారత కెప్టెన్‌గా..
ఈ సెంచరీతో భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన సారథిగా నిలిచాడు. గతంలో ధోనీ, కోహ్లీ లకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. కెప్టెన్‌గా ధోనీ వన్డే, టెస్ట్‌ల్లో సెంచరీలు నమోదు చేసినా.. టీ20ల్లో మూడెంకల స్కోర్ అందుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్‌గా టీ20ల్లో సెంచరీ చేయలేదు. గతేడాది ఆసియా కప్ 2022 విరాట్ సెంచరీ బాదినా.. అప్పటికే అతను కెప్టెన్సీ వదిలేశాడు. అంతర్జాతీయం జాబితాలో ఈ ఘనత సాధించిన కెప్టెన్లలో రోహిత్ నాలుగో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ కన్నా ముందు శ్రీలంక కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజామ్‌లు ఈ ఘనతను అందుకున్నారు. అయితే శ్రీలంక కెప్టెన్ దిల్షాన్ సారథిగా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి కెప్టెన్.