- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ravichandran Ashwin: నిజం ఒప్పుకో.. హ్యారీ బ్రూక్‌పై అశ్విన్ సెటైర్లు

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ (England)తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా (Team India) ఇప్పటికే 2-0 లీడ్‌లో ఉంది. ఓ వైపు ఛేజింగ్‌లో భారత్ (India) బ్యాట్స్‌మెన్లు ఉతికి ఆరేస్తుంటే.. బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని (Varun Chakravarthy) డీకోడ్ చేయలేక ఇంగ్లీష్ జట్టు చేతులెత్తేసింది. ఆ జట్టు డ్యాషింగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ (Harry Brook).. వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్‌లో వరుసగా వికెట్ పారేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా హ్యారీ బ్రూక్‌ను ఆ విషయంపై ప్రశ్నించగా.. పొగ మంచు వల్ల బంతి సరిగ్గా కనిపించక తాను ఔట్ అయ్యానని కామెంట్ చేశాడు.
ఈ నేపథ్యంలోనే అతడి వ్యాఖ్యలపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కామెంట్ చేశాడు. చెన్నై (Chennai)లో మ్యాచ్ జరుగుతోన్న సమయంలో పొగ మంచు లేనేలేదన్నాడు.. కానీ, హ్యారీ బ్రూక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడని తెలిపాడు. కోల్‌కతా (Kolkata)లో పొగ మంచు ఓకే.. చెన్నై (Chennai)లో బంతి బాగానే కనపడుతున్నా వరుణ్ బౌలింగ్ అవుట్ అయ్యావ్ కదా.. నిజం ఒప్పుకో హ్యారీ అంటూ అశ్విన్ సెటైర్లు వేశారు. వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) లెగ్ స్పిన్ వేయకుండా కేవలం గూగ్లీస్‌నే సంధించాడని అందువల్లే హ్యారీ బ్రూక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడిని అశ్విన్ కామెంట్ చేశాడు.