- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతను నా సైనికుడు': రవిశాస్త్రి
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఛెతేశ్వర్ పుజారా పై ప్రసంశలు కురిపించారు. 100 టెస్టులు ఆడుతున్న పుజారా గురించి రవిశాస్త్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం, ఫిబ్రవరి 17 నుంచి భారత్ తరఫున చెతేశ్వర్ పుజారా తన 100వ టెస్ట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో రవిశాస్త్రీ పుజారాను ఉద్దేశించి ఇలా అన్నాడు. పూజారా ఓ యోధుడు, అతను ఎల్లప్పుడూ.. తన సైనికుడు అని చెప్పుకొచ్చాడు. పుజరా 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన టాప్-ఆర్డర్ బ్యాటర్‌కు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు ఒక ప్రత్యేక క్షణం అని తెలిపారు.
చేతేశ్వర్ పుజారా పై రవిశాస్త్రి ప్రశంసలు
"అప్పుడు చెప్పాను, ఈ రోజు చెబుతున్నాను, అతను ఒక యోధుడు, గబ్బా టెస్ట్ తర్వాత నేను చెప్పినట్లుగా, అతను నా సైనికుడు, ఆస్ట్రేలియాలో రెండు సిరీస్‌లు గెలిచి భారత్ చరిత్ర సృష్టించగలిగితే, ఆ విజయాల్లో పుజారా పాత్ర చాలా పెద్దది," అని శాస్త్రి అన్నారు. "అతను ఒక నిశ్శబ్ద ఆపరేటర్, అతను అవసరమైనప్పుడు ప్రాణాంతకంగా ఉంటాడు. అతను భారత క్రికెట్‌కు గొప్ప సేవ చేసాడు. 100వ టెస్టు ఆడుతున్న అతనికి చాలా అభినందనలు,". అతని పెద్ద బలం అతని మొండి పట్టుదల అని పేర్కొన్నాడు. ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని పుజారా సొంతం చేసుకున్నాడని రవిశాస్త్రీ చెప్పాడు.