- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడి కంటే ఫిట్‌గా ఉన్న భారత క్రికెటర్ మరొకడు లేడు : Ravi Shastri
దిశ, వెబ్‌డెస్క్ : గత కొంత కాలంగా విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడం బాగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కోహ్లీ ఫామ్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ కార్యక్రమంలో తన అభిప్రాయాలు వెల్లడించాడు. కోహ్లీ ఫామ్‌లోకి రావడానికి కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే అవసరమని.. ఆసియాకప్ తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఫిఫ్టీ చేస్తే అందరి నోళ్లు మూసుకుంటాయన్నారు. అయితే ఆగస్టు 28న ప్రారంభంకానున్న ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో తలపడనుంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో ఒక్క ఫిఫ్టీ చాలు విమర్శించే నోళ్లన్నీ మూతపడతాయి. ఒక్క ఇన్నింగ్స్ వల్ల కోహ్లీ ఆటతీరులో మార్పు వస్తుంది. ఎందుకంటే కోహ్లీకి ఇంకా పరుగుల ఆకలి తగ్గలేదు అని రవిశాస్త్రి చెప్పాడు. కోహ్లీ కంటే ఫిట్‌గా ఉన్న భారత క్రికెటర్ మరొకడు లేడన్నాడు. టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ జట్టుపై మంచి రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు పాక్‌తో జరిగిన 7 టీ20 మ్యాచ్‌లో కోహ్లీ 77.75 సగటుతో 311 రన్స్ చేశాడు.