- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అఫ్గాన్ జట్టులోకి అతను తిరిగొచ్చాడు.. కానీ, భారత్‌పై ఆడటం డౌటే..
దిశ, స్పోర్ట్స్ : మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ టూరులో టీమ్ ఇండియాతో తలపడే అఫ్గాన్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) శనివారం ప్రకటించింది. ఇబ్రహీం జద్రాన్ సారథ్యంలో 19 మందితో కూడిన జట్టును వెల్లడించింది. అఫ్గాన్ రెగ్యులర్ టీ20 కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత రషీద్ ఖాన్ వెన్ను గాయం బారిన పడ్డాడు. గాయానికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. దీంతో యూఏఈతో సిరీస్‌కు అతను దూరమయ్యాడు. ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకుంటున్న అతను భారత్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే, అతను సర్జరీ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలోనే రషీద్ తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ యూఏఈ టూరులో జట్టును నడిపించిన ఇబ్రహీం జద్రాన్‌కే పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. యూఏఈ టూరుకు దూరంగా ఉన్న బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే, గుల్బాద్దీన్ నైబ్, ఇక్రమ్ అలిఖిల్ ప్రమోషన్‌పై మెయిన్ జట్టుకు ఎంపికయ్యారు. యూఏఈ సిరీస్‌కు ఎంపికైన మహ్మద్ ఇషాక్, సెడికుల్లా అటల్, దర్విష్ రసూలీ చోటు కోల్పోయారు. కాగా, టీ20 సిరీస్‌లో భాగంగా ఈ నెల 11న తొలి మ్యాచ్ జరగనుంది.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు : ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), గుర్బాజ్, ఇక్రమ్ అలిఖిల్, హజ్రతుల్లా జజాయ్, రహమత్ షా, జద్రాన్, మహ్మద్ నబీ, కరీమ్ జన్నత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫారుఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాద్దీన్ నైబ్, రషీద్ ఖాన్.