- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోసారి బంతితో విజృంభించిన త్యాగరాజన్..గెలుపు దిశగా హైదరాబాద్
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపు టైటిల్‌కు హైదరాబాద్ అడుగు దూరంలో నిలిచింది. మేఘాలయతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయానికి మరో 127 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 0/1తో సోమవారం ఆట కొనసాగించిన మేఘాలయను హైదరాబాద్ బౌలర్లు స్వల్ప స్కోరుకే నిలువరించారు. రాజ్ బిస్వా(100) శతకంతో చెలరేగగా.. జస్కీరత్ సింగ్(81) సత్తాచాటాడు. వీరిద్దరూ మినహా మిగతా వారు క్రీజులో నిలువలేకపోయారు. తనయ్ త్యాగరాజన్(5/86) మరోసారి బంతితో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. దీంతో మేఘాలయ రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటై.. హైదరాబాద్ ముందు 197 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనకు దిగిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కోల్పోయి 71 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(0) విఫలమవ్వగా.. మరో ఓపెనర్ రాహుల్ సింగ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రాహుల్ సింగ్(50 బ్యాటింగ్), తనయ్ త్యాగరాజన్(17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ గెలుపొందాలంటే ఇంకా 127 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. రెండు రోజులు ఆట మిగిలి ఉండగా.. నేడే ఫలితం వచ్చే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ 304 పరుగులు చేయగా.. హైదరాబాద్ 350 పరుగులు చేసిన విషయం తెలిసిందే.