- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి తిప్పేసిన త్యాగరాజన్.. రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు హైదరాబాద్
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపులో హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో నాగాలాండ్‌పై ఆదివారం ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. తనయ్ త్యాగరాజన్(6/81) మరోసారి విజృంభించడంతో హైదరాబాద్ కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఫాలో ఆన్ ఆడిన నాగాలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 20/1తో ఆదివారం ఆట కొనసాగించిన ఆ జట్టు బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ తేలిపోయారు. సుమిత్ కుమార్(86), సెడెజాలీ రూపెరో(59) రాణించగా.. మిగతా వారు క్రీజులో నిలువలేకపోయారు. మరోసారి తనయ్ త్యాగరాజన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని వికెట్లు పారేసుకున్నారు. త్యాగరాజన్ 6 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. కెప్టెన్ తిలక్ వర్మ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌ను హైదరాబాద్ 462/8 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇవ్వగా.. నాగాలాండ్ 206 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 13 వికెట్లు తీసిన తనయ్ త్యాగరాజన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నెల 12 నుంచి 21 వరకు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో మేఘాలయను హైదరాబాద్ ఢీకొట్టనుంది. అంతేకాకుండా, ఫైనల్‌కు చేరుకోవడంతో హైదరాబాద్ తిరిగి రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో చోటు దక్కించుకుంది. వచ్చే సీజన్‌లో హైదరాబాద్ ఎలైట్ గ్రూపులో ఆడనుంది.