- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓర్లీన్స్ మాస్టర్స్ టైటిల్ దిశగా రజావత్
పారిస్ : ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ సంచలనం ప్రియాన్షు రజావత్ టైటిల్ దిశగా దూసుకెళ్లాడు. టోర్నీలో సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్న రజావత్.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో ఐర్లాండ్ ఆటగాడు నాట్ న్గుయెన్‌ను 21-12, 21-9 తేడాతో చిత్తుగా ఓడించాడు. 44 నిమిషాల్లోనే రజావత్ ప్రత్యర్థి ఆటను ముగించాడు. తొలి గేమ్ నుంచే భారత ఆటగాడి ఆధిపత్యం కొనసాగింది. ప్రారంభంలో 5-2 తో కాస్త వెనుకబడిన.. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి 5-5తో స్కోరు సమం చేశాడు.
అనంతరం 8-8 తో ప్రత్యర్థి పోటీ నిచ్చేందుకు చూసిన అక్కడి నుంచి రజావత్ ఏకపక్షంగా పాయింట్లను గెలుచుకుని తొలి గేమ్‌ను సాధించాడు. రెండో గేమ్‌లో రజావత్‌దే హవా. వరుస పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. దాంతో వరుసగా రెండు గేమ్‌లను ఖాతాలో వేసుకున్న రజావత్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఒడిశా ఓపెన్ తర్వాత తన కెరీర్‌లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో అతను ఫైనల్‌కు చేరిన టోర్నీ ఇదే. గతేడాది థామస్ కప్ గెలిచిన భారత జట్టులో రజావత్ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే.