Suresh Raina :హోటల్‌లో చెఫ్‌గా మారిన సురేశ్ రైనా..!

by Anjali |   ( Updated:2023-06-26 05:55:21.0  )
Suresh Raina :హోటల్‌లో చెఫ్‌గా మారిన సురేశ్ రైనా..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా సడెన్‌గా హోటల్‌లో చెఫ్ అవతారమెత్తాడు. దీనికి సంబంధించిన ఫొటోలను స్వయంగా రైనానే తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనికి అసలు కారణం ఏంటంటే.. సురేశ్ రైనా పేరు మీద ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో రైనా ఇండియన్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా రైనా హోటల్ వంటగదిలో పలు రకాల వంటలు చేస్తున్నట్లు ఫొటోలను అప్లోడ్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, రైనా అప్‌లోడ్ చేసిన ఫొటోలకు క్యాప్షన్‌గా ఇలా రాసుకొచ్చాడు. ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో రైనా ఇండియన్ రెస్టారెంట్‌ను పరిచయం చేయడానికి నేను ఆనందిస్తున్నాను, ఇక్కడ ఆహారం, వంటల పట్ల నా అభిరుచికి ప్రాధాన్యతనిస్తుంది.

సంవత్సరాలుగా, మీరు ఆహారం పట్ల నాకున్న ప్రేమను చూశారు. నా వంటల సాహసాలను చూశారు. ఇప్పుడు, నేను భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి యూరప్ హృదయానికి నేరుగా అత్యంత ప్రామాణికమైన, నిజమైన రుచులను తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నానని రాశాడు. అలాగే.. మేము కలిసి ఒక రుచికరమైన సాహసయాత్ర ప్రారంభించినప్పుడు ఈ అసాధారణమైన గ్యాస్ట్రో నమిక్ ప్రయాణంలో నాతో చేరండి. మనోహరమైన అప్‌డేట్‌లు, మా నోరూరించే క్రియేషన్స్ యొక్క స్నీక్ పీక్‌లు, రైనా ఇండియన్ రెస్టారెంట్ యొక్క గొప్ప ఆవిష్కరణ కోసం చూస్తూ ఉండండని తన కొత్త రెస్టారెంట్ గురించి తెలిపాడు. కాగా, క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా రెస్టారెంట్ బిజినెస్ ప్రారంబించాడా అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈ పోస్ట్ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Next Story