చిన్నారి హెలికాప్టర్ షాట్‌కు ముగ్ధుడైన రైల్వే మంత్రి..

by Vinod kumar |
చిన్నారి హెలికాప్టర్ షాట్‌కు ముగ్ధుడైన రైల్వే మంత్రి..
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఓ బాలిక క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నారి క్లిష్టమైన డెలివరీలను సునాయాసంగా, కసితో షాట్స్‌గా మలచడాన్ని గమనించొచ్చు. స్వ్కేర్ కట్స్, కవర్ డ్రైవ్స్, అలా అన్ని రకాల షాట్స్ బాదేస్తోంది. ఈ ప్రతిభను చూసి రైల్వే మంత్రి ముగ్ధులయ్యారు. ‘‘హెలికాప్టర్ షాట్ నాకు బాగా నచ్చుతుంది. మరి మీకు..?’’ అంటూ ఆయన ప్రశ్న సంధించారు. ఈ వీడియోని 3 లక్షల మంది చూశారు.

Advertisement

Next Story

Most Viewed