- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగించాల్సిందే.. ఆ నిబంధన చెడ్డది కాదు : అశ్విన్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గత సీజన్ నుంచే అమల్లో ఉండగా.. ఈ సీజన్‌లో మాత్రం ఆ నిబంధనపై తీవ్ర చర్చ జరిగింది. రోహిత్, కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్ల కాకుండా మాజీలు సైతం ఆ రూల్‌ను విమర్శించడమే అందుకు కారణం. దీంతో బీసీసీఐ ఆ రూల్ అమలుపై పునరాలోచనలో పడగా.. ఇటీవల ఫ్రాంచైజీ మీటింగ్‌లోనూ చర్చించారు. అయితే, తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చాడు.
మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ యూట్యూబ్ చానెల్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కొనసాగించాలని చెప్పాడు. ‘ఆ రూల్ అంత చెడ్డది కాదు. ఎందుకంటే, ఆటలో ఇది వ్యూహాలకు మరింత పదును పెడుతుంది. ఆల్‌రౌండర్లకు నష్టం కలుగుతుందని కొందరు అంటున్నారు. కానీ, ఈ రూల్ వారిని నిరుత్సాహపర్చడం లేదు. వెంకటేశ్ అయ్యర్‌నే చూడండి.. అతను లాంకషైర్ తరపున ఆడుతున్నాడు. కొత్త ఆవిష్కరణలకు, ఆట మెరుగుపడటానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉపయోగపడుతుంది. అదన ప్లేయర్ అందుబాటులో ఉంటే మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠగా సాగుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.