- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అశ్విన్ @ నం.1.. టాప్-10లోకి రోహిత్
దిశ, స్పోర్ట్స్: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి టెస్టుల్లో నం.1 బౌలర్‌గా అవతరించాడు. ఇంగ్లాండ్‌తో ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో 100వ టెస్టు క్లబ్‌లో చేరిన అశ్విన్.. అదే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు(4+5) పడగొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో బుధవారం వెలువడిన ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రాను వెనక్కినెట్టి.. 870 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఈ విభాగంలో టాప్-1కు చేరడం అశ్విన్‌కు ఇది ఆరోసారి కావడం విశేషం. ఇక, తొలిస్థానాన్ని కోల్పోయిన బుమ్రా, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హజెల్‌వుడ్‌తో కలిసి 847 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ధర్మశాల టెస్టులో 7 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. 15 స్థానాలను మెరుగుపర్చుకుని 16వ స్థానానికి దూసుకొచ్చాడు. పురుషుల టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐదు స్థానాలు ఎగబాకి ఆరోస్థానానికి వచ్చాడు. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్.. 10వ స్థానం నుంచి 8వ స్థానానికి వచ్చాడు. శుభమన్ గిల్ 20వ స్థానానికి చేరుకున్నాడు. జట్ల ర్యాంకింగ్స్ చూస్తే, టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా టెస్టు, వన్డేల్లో రెండో స్థానంలో, టీ20ల్లో మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ టెస్టుల్లో మూడో స్థానంలో ఉండగా, టీ20ల్లో రెండు, వన్డేల్లో ఆరో స్థానంలో కొనసాగుతోంది.