- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన అశ్విన్.. అసలు ఏం జరిగింది?
దిశ, స్పోర్ట్స్ : విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు ప్రారంభమైంది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(179 నాటౌట్) భారీ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లను కోల్పోయి 336 పరుగులు చేసింది. అతనితోపాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అయితే, తొలి రోజు ఆఖరి ఓవర్ పూర్తయిన తర్వాత ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మైదానం వీడుతూ అశ్విన్ ఎందుకో సహనం కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్‌తో కాసేపు వాగ్వాదానికి దిగాడు. ఏదో విషయంపై నిలదీస్తూ గట్టిగా మాట్లాడాడు. అయితే, అందుకు కారణం తెలియరాలేదు.
మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇదే విషయంపై రజత్ పాటిదార్‌ను ప్రశ్నించగా అతను తెలియదని సమాధానమిచ్చాడు. తొలి రోజు ఆటను త్వరగా ముగించడంపై అశ్విన్.. అంపైర్‌ను నిలదీసినట్టు తెలుస్తోంది. మైదానంలో వెలుతురు ఉండగానే ఆటను నిలిపివేయడంపై అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.