Ravindra Jadeja: 'దేశం కోసమే ఆడుతున్నాం.. అంతేగానీ'.. కపిల్ దేవ్‌కు జడేజా స్ట్రాంగ్ కౌంటర్

by Vinod kumar |   ( Updated:2023-08-01 10:13:03.0  )
Ravindra Jadeja: దేశం కోసమే ఆడుతున్నాం.. అంతేగానీ.. కపిల్ దేవ్‌కు జడేజా స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారత మాజీ లెజెండ్ కపిల్‌ దేవ్‌ చేసిన కామెంట్స్‌కు భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చాడు. కష్టపడితేనే జట్టులో చోటు దక్కుతుందని.. అంతేతప్ప ఎవరూ తమకు అవకాశాలు వస్తున్నాయని భావించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు.. దేశం కోసం ఆడటం కంటే ఐపీఎల్ ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కపిల్‌ దేవ్‌ విమర్శించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ఆటగాళ్లలో అహంకారం పెరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాన్ఫిడెన్స్‌ ఉండటం మంచిదేనన్న కపిల్‌.. అయితే, అన్నీ తమకే తెలుసనన్న భావన పనికిరాదని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు.. ఎవరి సలహాలు, సూచనలు తీసుకోవడానికి కూడా ఇష్టపడరంటూ జడేజా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రవీంద్ర జడేజా ముందు విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ప్రతి ఒక్కరు భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లే. మేమంతా దేశం కోసమే ఆడుతున్నాం. మాకు వ్యక్తిగత ఎజెండాలంటూ ఏమీ ఉండవు’’ అంటూ జడ్డూ.. కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య ఆగష్టు 1 నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా మీడియాతో ముచ్చటించాడు. ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

Read More : గాయాలతో ఐపీఎల్ ఆడతారు.. జాతీయ జట్టుకు ఆడరు: క్రికెటర్లపై కపిల్ దేవ్ ఫైర్

Advertisement

Next Story

Most Viewed